ఢిల్లీ లో మూడు రోజులపాటు లాక్‌డౌన్   

వాస్తవం ప్రతినిధి:దేశంలో కరోనా వైరస్  మరోసారి విజృంభిస్తోంది.  దీంతో  ఢిల్లీ ప్రభుత్వం  కోవిడ్ నిబంధనల్లో మార్పులు చేసింది. రాష్ట్రంలో  లాక్‌డౌన్‌ను  మూడు రోజులపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోనుంది.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నట్టే..ఢిల్లీలో గత కొద్దిరోజులుగా పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి.      హోలీ పండగ నేపథ్యంలో దేశరాజధాని ఢిల్లీలో లాక్‌డౌన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెల 28న హోలీ ఉండటంతో.. కఠిన ఆంక్షలు విధించాలని సర్కార్ సిద్ధమైంది. అయితే 28 నుంచి 30 వరకు లాక్‌డౌన్‌ విధించాలని సూచించారు అధికారులు. ఇక ఢిల్లీలో క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. వారం వ్యవధిలోనే 4 వేల 288 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో విపత్తు నిర్వహణ అథారిటీ కాసేపట్లో సమావేశం కానుంది. పెరుగుతున్న కొవిడ్ కేసులపై జరగనున్న చర్చించనుంది. ఈ సమావేశానికి లెఫ్టినెంట్ గవర్నర్, సీఎంతో పాటు ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ సమావేశం తర్వాత లాక్‌డౌన్‌పై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.