ఈటెల రాజేందర్ తో సీఎం కేసీఆర్ భేటీ..లాక్ డౌన్ అంశంపై  చర్చ  

వాస్తవం ప్రతినిధి:  దేశవ్యాప్తంగా కరోనా కేసులు కొంచెం కొంచెంగా మరోసారి పెరుగుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తో ఇప్పటికే పలు రాష్ట్రాలు పాక్షిక లాక్ డౌన్ నైట్ కర్ఫ్యూలను అమలు చేస్తున్నాయి. తెలంగాణలోనూ కొన్ని రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.
 ఈ నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అవుతోంది. మంత్రి ఈటెల రాజేందర్ తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్ డౌన్ విధించే అంశంపై కసరత్తు చేస్తున్నారు. కరోనా పరిస్థితుల పై చేపట్టాల్సిన అంశాలపై ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్ధులను ప్రమోట్ చేసే ఆలోచన చేస్తుంది. రేపు అసెంబ్లీలో కీలక ప్రకటన చేయనున్నారు.