జోగిపేట బోయ్స్ అమెరికా ఫ్లైట్ ఎక్కేస్తున్నారండోయ్..  

 వాస్తవం ప్రతినిధి: ఇటీవల టాలీవుడ్ కి మంచి ఊపు తెచ్చిన సినిమా జాతిరత్నాలు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఇటు తెలుగు రాష్ట్రాలు సహా అటు అమెరికాలోనూ జాతిరత్నాలు అద్భుత వసూళ్లను సాధించింది.
 నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ‘జాతిరత్నాలు’ ట్రేడ్, సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తూ కలెక్షన్లను నమోదు చేస్తున్నది. తొలి వారాంతంలో షాకింగ్‌గా వసూళ్లను సాధిస్తున్నది. తొలి రోజు తర్వాత జాతి రత్నాలు దూకుడు అంతే జోరుతో కొనసాగింది. ప్రస్తుతం ఈ చిత్రం యూఎస్‌లో భారీ కలెక్షన్లు రాబట్టుకుంటుంది. ఈ సక్సెస్ ని పురస్కరించుకుని జోగిపేట బోయ్స్ అమెరికా విమానం ఎక్కేస్తున్నారు. ఇదే విషయాన్ని ఎంతో సంతోషంగా సక్సెస్ వేదికపై నవీన్ పోలిశెట్టి వెల్లడించారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. దీంతో బ్లాక్ బస్టర్ దిశగా జాతిరత్నాలు దూసుకుపోతోంది.