వాస్తవం ప్రతినిధి: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 21 నుంచి దేశ రాజధాని ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా హైకోర్టులో కేసులు వేసినట్లు తెలిపారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు పాల్ సంఘీభావం తెలిపారు. అంతేకాదు..సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.