‘మనందరి పెదరాయుడు గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు’

వాస్తవం ప్రతినిధి: ఏ పాత్రలోకైన పరకాయ ప్రవేశం చేసి..తన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకునే మేనరిజం అతనిది. విలన్‏గా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన ఆ తర్వాత హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం రౌడీగా, హీరోగా మాత్రమే కాకుండా.. హాస్యం పండించడంలోనూ దిట్ట. అందుకే ఆయనను డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్ అంటుంటారు. ఈరోజు డైలాగ్ కింగ్ మోహన్ బాబు 69వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మోహన్ బాబు ఇటీవల సూర్య ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రను పోషించారు. తాజాగా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందే ‘శాకుంతలం’లోనూ నటిస్తున్నారు. ఇందులో దూర్వాస మహాముని పాత్రను మోహన్ బాబు పోషిస్తున్నారు. ప్రస్తుతం ‘సన్నాఫ్ ఇండియా’ సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రబృందం మోహన్ బాబు పోస్టర్ తో బర్త్ డే విషెస్ తెలియజేసింది. ఇక హీరో మంచు మనోజ్ విషెస్ తెలియజేస్తూ.. ‘మనందరి పెదరాయుడు గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అంటూ పోస్ట్ చేశారు.