ఓయూ లేడీస్‌ హాస్టల్‌లో కరోనా కలకలం       

 వాస్తవం ప్రతినిధి: హైదరాబాద్‌లో కరోనా మహమ్మారి మళ్లీ భయపెడుతోంది. చాపకింద నీరులా వైరస్‌ విజృంభిస్తోంది. కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. విద్యాలయాలే హాట్ స్పాట్స్‌గా కోవిడ్ శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే పలు స్కూళ్లలో ఉపాధ్యాయులు, విద్యార్ధులు వైరస్ బారిన పడగా, ఇప్పుడు ఉస్మానియా యూనివర్శిటీలో కూడా కరోనా కలకలం రేగింది. ఓయూ లేడీస్‌ హాస్టల్‌లో ఐదుగురు పీజీ విద్యార్ధినులకు వైరస్ సోకడంతో కింగ్ కోఠి హాస్పిటల్‌కు తరలించారు. హాస్టల్‌‌లో మొత్తం 300మంది విద్యార్ధినులు ఉండటంతో అందరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించి రూమ్స్‌‌ను శానిటైజ్ చేశారు.