ఇంగ్లండ్‌తో  జ‌ర‌గ‌నున్న వ‌న్డే సిరీస్‌కు భార‌త జ‌ట్టును  ప్రకటించిన బీసీసీఐ  

     వాస్తవం ప్రతినిధి: ఇంగ్లండ్‌తో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న వ‌న్డే సిరీస్‌కు భార‌త జ‌ట్టును బీసీసీఐ ఈ రోజు ప్ర‌క‌టించింది. జ‌ట్టులో సూర్యకుమార్ యాదవ్, క్రునాల్ పాండ్యాకు చోటు ద‌క్కింది. టీమిండియా స్క్వాడ్ లో విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, శుభ్‌మ‌న్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషభ్‌ పంత్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), యుజ్వేంద్ర ఛాహెల్, కుల్దీప్ యాద‌వ్‌, క్రునాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, నటరాజన్, భువనేశ్వర్ కుమార్, ఎండీ సిరాజ్, ప్ర‌సిధ్‌ కృష్ణ, శార్దుల్ ఠాకూర్ ఉన్నారు.
    మూడు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా ఆ మూడు మ్యాచులు పూణెలోనే జ‌ర‌గ‌నున్నాయి. మొద‌టి వ‌న్డే ఈ నెల 23న‌, రెండో వ‌న్డే 26న‌, మూడో వ‌న్డే 28న జ‌రుగుతుంది.
    ఇటీవ‌ల జ‌రిగిన టెస్టు సిరీస్‌లో విజ‌యం సాధించిన టీమిండియా ప్ర‌స్తుతం జ‌రుగుతోన్న‌ టీ20ల్లోనూ విజ‌యం సాధించాల‌ని క‌సిగా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన నాలుగు టీ20 మ్యాచుల్లో 2-2 తో ఇరు జ‌ట్లు స‌మంగా నిలిచిన విష‌యం తెలిసిందే. నిర్ణ‌యాత్మ‌క ఐదో టీ20పై ఉత్కంఠ నెల‌కొంది. నాలుగో  టీ20 మ్యాచు‌లో సూర్యకుమార్ అద్భుతంగా రాణించ‌డంతో వ‌న్డే సిరీస్‌లో చోటు ద‌క్కింది.