తెలంగాణలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా ..

 వాస్తవం ప్రతినిధి:తెలంగాణలో కరోనా మళ్లీ విజృంభిస్తున్నట్టు స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. గత కొన్నిరోజులుగా కొత్త కేసుల సంఖ్య 200 దాటుతోంది. తాజాగా తెలంగాణలో 247 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 29 మంది కరోనా బారినపడ్డారు. అదే సమయంలో రాష్ట్రంలో 158 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. తెలంగాణలో తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3,01,769కి పెరిగింది. వారిలో 2,98,009 మంది కోలుకున్నారు. ఇంకా 2,101 మందికి చికిత్స జరుగుతోంది.