టాంజానియా అధ్యక్షుడు కన్నుమూత

    వాస్తవం ప్రతినిధి: టాంజానియా అధ్యక్షుడు జాన్‌ మగుఫులి (61) మృతి చెందారని ఉపాధ్యక్షుడు సులుహు హాసన్‌ ప్రకటించారు. గత కొన్ని రోజులగా ఆయన కనిపించకపోవడంతో పాటు ఆరోగ్యంపై అనిశ్చితి నెలకొనగా… బుధవారం రాత్రి ఈ ప్రకటన చేశారు. గుండెకు సంబంధించిన సమస్యలతో ఆయన మరణించారని చెప్పారు. ఈ నెల 6న జకాయ కిక్వేట్‌ కార్డియాక్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేర్చగా.. ఆ తర్వాత డిశ్చార్జ్‌ అయ్యారని, అయితే 14న మరల అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆసుపత్రికి తరలించామని చెప్పారు. ఈ ప్రకటన వెలువడిన తర్వాత, ప్రతిపక్ష నేత జిట్టో కబ్వే సంతాపం ప్రకటించారు. దేశాభివృద్ధికి ఆయన చేసిన కృషి గురించి మననం చేసుకుంటూ ట్విట్టర్‌లో ఓ పోస్టు చేశారు.