కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు

వాస్తవం ప్రతినిధి: టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు కుటుంబ సమేతంగా ఈ నెల 21న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఆ రోజు తన మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు రానున్నారు. ఈ నేపథ్యంలో అన్నదానం ట్రస్టుకి 30 లక్షల రూపాయలు విరాళంగా అందించనున్నారు. ఏటా దేవాన్ష్ పుట్టినరోజు సందర్బంగా అన్నదానానికి చంద్రబాబు కుటుంబ సభ్యులు విరాళమిస్తున్నారు.