దేశంలో కరోనా వైరస్ కేసులు ఉధృతి..బీసీసీఐ కీలక నిర్ణయం 

     వాస్తవం ప్రతినిధి: దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లి పెరగడంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు( బీసీసీఐ) అనూహ్య నిర్ణయం తీసుకుంది. వినూ మాన్కడ్‌ ట్రోపీ సహా అన్ని విభాగాల క్రికెట్‌ టోర్నమెంట్లను రద్దు చేస్తున్నట్టు బీసీసీఐ స్పష‌్టం చేసింది. ఈ మేరకు బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జై షా వెల్లడించారు. త్వరలో జరబోయే అన్ని టోర్నీలు రద్దు చేయాలని అన్ని రాష్ట్రాల క్రికెట్ బోర్డులకు ఆదేశాలు జారీ చేశారు. కరోనా వైరస్ ఉదృతి కారణంగా అన్ని బోర్డులకు రాష్ట్రాల బోర్డులకు సమాచారం అందించారు.