సీఐడీ నోటీసులపై రేపు హైకోర్టులో పిటిషన్ వేయనున్న చంద్రబాబు!

 వాస్తవం ప్రతినిధి:ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి భూములకు సంబంధించి గత టీడీపీ ప్రభుత్వం ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిందంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆరోపిస్తోంది. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిన వారి పేరుతో కేబినెట్ సబ్ కమిటీ ఓ నివేదికను 2019 డిసెంబర్‌లో సిద్ధం చేసింది. ఆ కేబినెట్ సబ్ కమిటీ రిపోర్టు ప్రకారం ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిన వారిలో ముఖ్యమైన వారి పేర్లతో ఆరుగురి పేర్లను కేబినెట్ సబ్ కమిటీ పొందుపరించింది.
 ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరుతో పెద్ద ఎత్తున్న భూకుంభకోణానికి తెర తీశారని తెలుగుదేశం అధినేత,నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
సీఐడీ నోటీసులపై హైకోర్టుకు వెళ్లే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న న్యాయనిపుణులతో సమావేశమైన చంద్రబాబు.. వారి వద్ద నుంచి సలహాలు తీసుకున్నారు. చంద్రబాబు రేపు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. తనపై నమోదైన కేసుకు సంబంధించిన.. ఎఫ్‌ఐఆర్‌ కొట్టివేయాలని కోరనున్నట్లు సమాచారం.