కరోనాతో కేంద్ర మాజీ మంత్రి మృతి..ప్రముఖులు సంతాపం

వాస్తవం ప్రతినిధి: కేంద్ర మాజీ మంత్రి బీజేపీ నాయకుడు దిలీప్ గాంధీ కరోనాతో బాధ పడుతూ బుధవారం కన్నుమూశారు. మంగళవారం కరోనా పాజిటివ్ నిర్ధారణ ఆయన ఢిల్లీలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆయన తుది శ్వాస తీసుకున్నారు. అహ్మద్నగర్ దక్షిణ లోక్సభ నియోజకవర్గానికి చెందిన దిలీప్ గాంధీ దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. మొదటిసారి 1999లో ఆ తరువాత 2009 2014లో మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 2014 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో దిలీప్ గాంధీ 2 లక్షల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. 2009 లో జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచారు. దిలీప్ గాంధీ మరణంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విటర్ ద్వారా విచారం వ్యక్తం చేశారు. దిలీప్ గాంధీ మృతికి మాజీ మంత్రి సురేష్ ప్రభు ఇతర ప్రముఖులు తీవ్ర సంతాపం ప్రకటించారు.