సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా 

      వాస్తవం ప్రతినిధి: టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడు. అందరూ ఊహించినట్లుగానే క్రికెట్ ప్రజెంటేటర్ సంజనా గణేషన్‌ను గోవాలో రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లికి బుమ్రా, సంజనా కుటుంబాల నుంచి కేవలం 20 మంది మాత్రమే హాజరయ్యారు. స్నేహితులు, మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
      ఇక సంజనాను ఈరోజు పెళ్లి చేసుకొని బుమ్రా అందరిని షాక్ కు గురి చేస్తూ  తన పెళ్ళికి సంబంధించిన ఫోటోలను బుమ్రానే ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. అయితే ఇంగ్లాండ్ తో జరిగే చివరి టెస్ట్ నుండి బుమ్రా తప్పుకున్న సమయం నుండి ఈ పెళ్ళికి సంబంధించిన వార్తలు ఎక్కువయ్యాయి. ఇక ఈరోజుతో వాటికీ చెక్ పడిందనే చెప్పాలి.