తిరుమల శ్రీవారికి రూ. 300 కోట్లు విరాళం అందించిన భక్తుడు

వాస్తవం ప్రతినిధి: ముంబైకి చెందిన సంజయ్ సింగ్ అనే భక్తుడు గురువారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రూ. 300 కోట్లు స్వామివారికి కానుకగా సమర్పించబోతున్నట్టు ప్రకటించాడు. ఈ డబ్బుతో తిరుపతిలో ఓ ఆస్పత్రిని నిర్మించాలని ఆయన కోరారు. ఏడుకొండల వాడికి కానుకలు విరాళాలు సమర్పించడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. అయితే అప్పుడప్పుడు కొందరు భక్తులు భారీ విరాళం చెల్లిస్తుంటారు.

ఈ సందర్భంగా సంజయ్ సింగ్ ను టీటీడీ అధికారులు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అభినందించారు. త్వరలోనే ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నట్టు ప్రకటించారు.