సౌతాఫ్రికా టీమ్ పై మిథాలీసేన విజయం

    వాస్తవం ప్రతినిధి: దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో జరిగిన తొలివన్డే ఘోర పరాజయం తర్వాత.. భారత మహిళల జట్టు పుంజుకుంది. లఖ్​నవూ వేదికగా మంగళవారం జరిగిన రెండో వన్డే 9 వికెట్ల తేడాతో మిథాలీసేన ప్రత్యర్థిపై గెలుపొందింది. సౌతాఫ్రికా టీమ్ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా కేవలం 28.4 ఓవర్లలో వికెట్​ నష్టపోయి ఛేదించింది.

    టీమ్ఇండియా బ్యాట్స్​వుమెన్​ స్మృతి మంధాన (80), పూనమ్​ రౌత్​ (60) చెరో అర్ధశతకంతో చెలరేగి.. జట్టుకు విజయాన్ని అందించడంలో కీలకంగా వ్యవహరించారు.

    అంతకుముందు టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన దక్షిణాఫ్రికా మహిళల జట్టు 41 ఓవర్లలో 157 పరుగుల చేసి ఆలౌట్​ అయ్యింది. టీమ్ఇండియా బౌలర్లు గోస్వామి 4 వికెట్లతో చెలరేగగా.. గైక్వాడ్​(3), మానసి జోషీ (1) వికెట్లు పడగొట్టారు.