మహిళల గొప్పతనం గురించి విరాట్ కోహ్లీ ట్వీట్

    వాస్తవం ప్రతినిధి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీమిండియా సారథి విరాట్ కోహ్లీ చాలా ఎమోషనల్ అయ్యాడు. తన భార్య అనుష్క శర్మ, కుమార్తె వామికా ఫోటోను అభిమానులతో పంచుకున్న కోహ్లీ.. మహిళల గొప్పతనం గురించి అద్భుతమైన సందేశం ఇచ్చాడు. తన జీవితంలో తొలిసారి తండ్రి అయిన విరాట్ కోహ్లీ.. ‘మహిళా పథం మహిళ కంటే కూడా శక్తివంతమైనది’ అని పేర్కొన్నాడు. ఇక విరాట్ షేర్ చేసిన ఫోటోలో అనుష్క శర్మ.. వామికా ను ఎత్తుకుని ఆడిస్తోంది. చిరునవ్వులు చిందిస్తూ కూతరుతో ఉల్లాసంగా ఉంది. అయితే వామికా ముఖం ఆ ఫోటోలో కనిపించలేదు.

    ‘‘మనిషి జీవితంలో తల్లిదండ్రులైన క్షణానికి మించిన అద్భుతమైన తరుణం మరోటి ఉండదు. పిల్లల జననాన్ని చూసినప్పుడు వెన్నెముకలో ఏదో తెలియని అలజడి కలుగుతుంది. నమ్మశక్య కాని, అద్భుతమైన అనుభూతి ఆ సమయంలో కలుగుతుంది. దానిని చూసిని ఎవరైనా సరే మహిళలు గ్రేట్ అనక మానరు. మహిళా శక్తిని, వారిలో దైవత్వాన్ని అర్థం చేసుకుంటారు. పురుషులకంటే బలవంతులు కాబట్టే మహిళలు మరో జీవితానికి ఊపిరిపోసే అవకాశాన్ని ఆ దేవుడు కల్పించాడు. నా జీవితంలో అంత్యంత ముఖ్యమైన ధైర్యశీలి, దయాగుణం కలిగిన, స్ట్రాంగర్‌ అయిన అనుష్క శర్మ.. తన తల్లిలాగే ఎదుగుతున్న నా కూతురుకి. ప్రపంచంలోని మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.’’ అని కోహ్లీ రాసుకొచ్చాడు.