షర్మిల కొత్త పార్టీపై పోసాని కీలక వ్యాఖ్యలు

వాస్తవం ప్రతినిధి: సినీ నటుడు పోసాని కృష్ణమురళి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏపీ రాజకీయాలపై స్పందించారు. వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడంపై కొద్దిరోజులుగా ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈక్రమంలోనే షర్మిల సైతం తనకు వైసీపీలో ఎందుకు పదవులు ఇవ్వలేదో అన్నయ్య జగన్ నే ఈ విషయం అడగండని విలేకరులతో అనడంతో వీరి మధ్య విభేదాలు వచ్చాయన్న ప్రచారం జోరుగాసాగింది. పలువురు రాజకీయ నాయకులు సైతం షర్మిలకు జగన్ అన్యాయం చేశారని ఆరోపించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే ప్రముఖ టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళి స్పందించారు. షర్మిల ఎదగాలనే తెలంగాణలో పార్టీ పెడుతున్నారని.. అయితే అందులో తప్పేంటని పోసాని ప్రశ్నించారు. షర్మిల రాకను స్వాగతిస్తున్నట్టు పోసాని తెలిపారు.షర్మిలకు జగన్ ఎటువంటి అన్యాయం చేయలేదని చెప్పారు. చేసి ఉంటే ఏపీలోనే షర్మిల పోటీకి వచ్చేవారు కదా అని ప్రశ్నించారు.