‘ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు’ ఎన్టీఆర్ హోస్టింగ్..ప్రోమో రిలీజ్

వాస్తవం సినిమా: ఒకవైపు సిల్వర్ స్క్రీన్‌తో పాటు మరోవైపు బుల్లితెరపై కూడా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాణిస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ హోస్ట్ చేసిన తెలుగు బిగ్‌బాస్-1కు అత్యధిక టీఆర్‌పీ రేటింగ్స్ రాగా.. దీంతో బుల్లితెరపై కూడా ఎన్టీఆర్ తన సత్తా చూపించాడు. ఎన్టీఆర్ హోస్టింగ్‌కు ప్రేక్షకులందరూ ఫిదా అయిపోయారు. ఎన్టీఆర్ హోస్టింగ్ వల్ల బిగ్ బాస్ సీజన్ 1 సూపర్ సక్సెస్ అయింది.

“మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు’ అంటూ గ‌తంలో నాగార్జున‌, చిరంజీవి అల‌రించిన విష‌యం తెలిసిందే. ఈసారి ఈ కార్య‌క్ర‌మం ‘ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు’ పేరుతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అలాగే, ఈ కార్య‌క్ర‌మం జెమినీ టీవీలో ప్ర‌సారం కానుంది.

ఇందుకు సంబంధించిన షూటింగ్ అన్న‌పూర్ణ స్టూడియోలో జ‌రుగుతున్న‌ట్లు ఇటీవ‌లే ప్ర‌చారం జ‌రిగింది. అయితే, దీనిపై ఈసారి అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఈ రోజు విడుద‌ల చేసిన ప్రోమోలో చైర్‌లో హోస్ట్ కూర్చుని ఉన్నాడు. అయితే, ఆయ‌న ముఖాన్ని నేరు చూప‌కుండా నీడ‌లా చూపించారు. దాన్ని గ‌మ‌నించి చూస్తే ఎన్టీఆర్ ఆ కుర్చీలో కూర్చున్నట్లు అర్థ‌మ‌వుతోంది.

అప్ప‌ట్లో ఎన్టీఆర్‌కు బిగ్ బాస్ సీజ‌న్ 1లోనూ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించిన అనుభ‌వం ఉంది. ‘ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు’కు సంబంధించిన ప్రోమోల షూటింగ్ కొన‌సాగుతోంది. జూనియ‌ర్ ఎన్టీఆర్ భారీగా రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ‘ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు’కు సంబంధించిన పూర్తి స్థాయి ప్రోమో త్వ‌ర‌లోనే విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది.