ఈ ఏడాది రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు..వాతావరణ శాఖ హెచ్చరిక

వాస్తవం ప్రతినిధి: ఈ సంవత్సరం భానుడి భగ భగలు మరింతగా ఉంటాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా తెలంగాణ..ఆంధ్రప్రదేశ్ లతో పాటు తమిళనాడు, కర్ణాటకల్లో వేడిమి అధికంగా ఉంటుందని, రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. సాధారణ పరిస్థితుల్లో ఉదయం నుంచి పెరిగే ఎండలు సాయంత్రానికి కాస్తంత ఉపశమనాన్ని ఇస్తాయని, కానీ ఈ సంవత్సరం సాయంత్రంలోనూ తీవ్రమైన ఉక్కపోతను అనుభవించాల్సి వుంటుందని, వేసవి వేడిమి 42 డిగ్రీల సెల్సీయస్ వరకూ చేరవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.