వామ్మో.. ఆ విషయంలో ‘ఉప్పెన’ ముద్దుగుమ్మ డిమాండ్ మామూలుగా లేదుగా..

వాస్తవం సినిమా: తొలి చిత్రం ‘ఉప్పెన’ తో భారీ విజయం సాధించింది హీరోయిన్ కృతి శెట్టి. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాను బుచ్చిబాబు డైరెక్షన్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కృతి శెట్టి..టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లంత స్టార్ డమ్‌ను సొంతం చేసుకుందనడంలో సందేహం లేదు. ఇటు అందంతోనే కాదు..అటు నటనతోనూ ఆకట్టుకుంటోంది ఈ ముద్దుగుమ్మ.

అయితే..ఈ అవకాశాన్ని రెమ్యూనరేషన్ విషయంలో వాడుకోవాలని చూస్తుంది కృతి శెట్టి. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దు కోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. తొలి చిత్రానికి రూ.6 లక్షలు అందుకున్న ఈ నటి..రాబోయే ప్రాజెక్టుల కోసం దాదాపు కోటి రూపాయాలు కావాలని నిర్మాతలను డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.

టాలీవుడ్ లోని ప్రముఖ నిర్మాతల్లో ఒకరు ఇటీవల ఓ చిత్రం కోసం ఈ ముద్దుగుమ్మను సంప్రదించగా…సదరు ప్రాజెక్టు కోసం రూ.1 కోటి డిమాండ్ చేసిందంట. డబ్బుతో పాటు డ్రెస్‌లు, వ్యక్తిగత సిబ్బంది, ఆహారం లాంటి విషయాల్లో కొన్ని కండిషన్లు పెట్టిందంట. దీంతో షాకైన సదరు నిర్మాత..ఫాంలో ఉంది కనుక చేసేందేంలేక ఆమె నిబంధనలకు ఓకే చెప్పాడని టాక్ వినిపిస్తోంది. స్టార్ హీరోయిన్లే ఇలాంటి నియమాలు పెట్టరని, కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన కృతి శెట్టి నిర్మాతలకు పెట్టిన షరతులు చూస్తూంటే నిజంగా పెద్ద షాకింగే అనుకుంటున్నారు టాలీవుడ్ ప్రముఖులు.