యష్ నో చెప్పిన ప్రాజెక్ట్ కి ప్రభాస్ ఓకే చెప్పాడా..?

వాస్తవం సినిమా:కేజీఎఫ్ హీరో యశ్ రిజెక్ట్ చేసిన సినిమాను ప్రభాస్ ఓకే చేశారంటూ వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే..

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. రాధేశ్యామ్ పూర్తి అయిన తరువాత వెంటనే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ సినిమా ఆదిపురుష్, ప్రశాంత్ నిల్ సినిమా సలార్‌ను ప్రారంభించారు. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సినిమాతో జాతీయ స్థాయి దర్శకుడు అయ్యారు.

అయితే ప్రస్తుతం అయితే ప్రశాంత్ నీల్ యశ్‌కు కేజీఫ్, సలార్ రెండు కథలు వినిపించారంట. కానీ యశ్ మాత్రం కేజీఎఫ్‌ను ఓకే చేసిన సలార్ కథను రిజెక్ట్ చేశారంట. ఆ తరువాత కేజీఎఫ్ ఎంతటి విజయం అందుకుందో అందిరికీ తెలిసిన విషయమే. దాంతో ప్రశాంత్ నిల్ తన రెండో కథలో కొన్ని మార్పులను చేసి ప్రభాస్‌కు వినిపించారంట. కథ ప్లాట్ నచ్చడంతో ప్రభాస్ వెంటనే ఒకే చేశారు. దీంతో యశ్ రిజెక్ట్ చేసిన సినిమాను ప్రభాస్ ఓకే చేశారంటూ వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. .

ప్రస్తుతం ఈ సినిమా సలార్ శరవేగంతో తెరకెక్కుతోంది. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఇందులో ప్రభాస్ జోడీగా శ్రుతిహాసన్ నటిస్తున్నారు.

అయితే ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నారు. అభిమానులు రెండు సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.