ప్రయాణికులకు షాక్: రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ రేట్లు భారీగా పెంపు

వాస్తవం ప్రతినిధి: కరోనా వ్యాప్తి కట్టడికి రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే ప్లాట్‌ ఫాం టికెట్ ధరను ఒకేసారి 20 రూపాయలు పెంచేసింది. పెరిగిన ధరతో 30కు చేరింది రైల్వే ప్లాట్‌ ఫాం టికెట్ ధర. ప్లాట్ ఫాం టికెట్ ధరల పెంపుపై ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పెంచిన ధరలను వెంటనే అమల్లోకి తేవాలని అన్ని జోన్లకు ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. ధరలను తాత్కాలికంగా మాత్రమే పెంచినట్లు రైల్వేశాఖ వెల్లడించింది. కరోనా వ్యాప్తి నివారించడం తమ బాధ్యత అని పేర్కొన్న రైల్వేశాఖ రైల్వేస్టేషన్‌లలో ప్రజలు గుమిగూడడాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయమని తెలిపింది.