శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు.నేడు మల్లన్నకు భ్రుంగివాహన సేవ

వాస్తవం ప్రతినిధి: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం అయ్యాయి. పుణ్యక్షేత్రంలో శివనామ స్మరణలు మిన్నంటుతున్నాయి. యాగశాల ప్రవేశంతో మల్లన్న బ్రహ్మోత్సవాలకు వేద పండితులు అంకురార్పణ చేయగా.. 11 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. భక్తుల సౌకర్యార్థం.. ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో భాగంగా నిత్యం మల్లన్నకు వాహన సేవలు జరగనున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ తేదీన అనగా నేడు మల్లన్నకు భ్రుంగివాహన సేవ, 6న హంస వాహనసేవ, 7వ తేదీన మయూర వాహనసేవ, 8న రావణ వాహనసేవ నిర్వహించనున్నారు. 9వ తేదీన స్వామి, అమ్మవార్లకు పుష్పపల్లకి సేవ నిర్వహిస్తారు. అలాగే.. 10న గజవాహనసేవ ఉంటుంది. ఇక.. అదే రోజు ఏపీ ప్రభుత్వం తరపున స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.