వాస్తవం ప్రతినిధి: మోడీసర్కార్పై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా బిజెపి అంటే.. ‘బర్డన్ జనతా పార్టీ’ అంటూ కొత్త నిర్వచనం చెబుతూ ఎద్దేవా చేశారు. దేశ హితాన్ని దృష్టిలో పెట్టుకుని, బిజెపి దోచుకున్న దానిని అందరూ ప్రశ్నించాలని, తమతో గొంతు కలపాలని, దేశం మొత్తం కదిలి రావాలని రాహుల్ పిలుపునిచ్చారు. ‘పెరిగిన ధరలకు వ్యతిరేకంగా గళమెత్తండి’ అని ట్వీట్ చేశారు. పన్నుల్ని పెంచుతూ దేశ ప్రజల్ని కేంద్ర ప్రభుత్వం ఊబిలోకి నెట్టేస్తోందని దుయ్యబట్టారు. దేశాన్ని మోడీ ప్రభుత్వం విధ్వంసం దిశగా తీసుకెళ్తోందని, దానికి వ్యతిరేకంగా అందరూ గళమెత్తాలని ఆయన అభ్యర్థించారు. దీంతోపాటు పెరిగిన పెట్రోల్ ధరలకు సంబంధించి ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు.