“ఏయ్… నవ్వకండి… ఇట్స్ ఏ సీరియస్ మ్యాటర్.”..ప్రచారంలో బాలయ్య వార్నింగ్

వాస్తవం ప్రతినిధి: నందమూరి బాలకృష్ణ ఏది చేసినా డిఫరెంట్‌. సినిమాల్లో డైలాగులు పేల్చాలన్నా.. రాజకీయాల్లో ఉపన్యాసాలు ఇవ్వాలన్నా ఆయనకే ఆయనే సాటి. ప్రస్తుతం  ఎమ్మెల్యే నందమూరి బాలయ్య హిందూపురం పర్యటనలో ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. గురువారం పట్టణంలో అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. మొదటి రోజు పర్యటనలో భాగంగా ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, తాను మాట్లాడుతున్న వేళ, నవ్విన పార్టీ నేతలపై ఆగ్రహాన్ని ప్రదర్శించారు.

నేటి తరం యువత గురించి మాట్లాడిన బాలకృష్ణ, “రాత్రి అయితే బండ్లేసుకుని ఏదో రకంగా రోడ్లలో స్ట్రీట్ లైట్లు చూసుకుంటూ… చుక్కలు లెక్కబెడుతూ.. వీళ్లలా పోవడం… ఏదో ఢీ కొట్టడం…” అంటుండగా, పక్కనే ఉన్న హిందూపురం తెలుగుదేశం పార్లమెటరీ నియోజకవర్గం అధ్యక్షుడు బీకే పార్థసారధి తదితరులు పెద్దగా నవ్వారు.

వెంటనే కాస్తంత అసహనానికి గురైన బాలయ్య, “ఏయ్… నవ్వకండి… ఇట్స్ ఏ సీరియస్ మ్యాటర్. నాకు తెలుసు. చాలా మంది అలా తయారవుతున్నారు. సో జాగ్రత్తగా ఉండు…” అని వేలు చూపుతూ హెచ్చరించారు. బాలకృష్ణ వ్యాఖ్యలకు సంబందించిన వీడియో వైరల్ అవుతోంది. దాన్ని మీరు కూడా చూడవచ్చు.