వాస్తవం ప్రతినిధి: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల బంద్ పిలుపునకు బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలనుండి మద్దతు లభించింది. దీంతో ఉదయం నుండే ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయితే వాణిజ్య సముదాయాలతో పాటు ప్రైవేటు స్కూలు, ప్రభుత్వ స్కూల్స్ అన్ని కూడా మూతపడ్డాయి.
మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్, ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తో పాటు పలువురు నేతలు నిరసనలో పాల్గొన్నారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చర్యలను మానుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ బంద్కు వైఎస్ఆర్సీపీ పార్టీ సైతం మద్ధతు ఇవ్వడం విశేషం. బీజేపీ మినహా రాష్ట్రంలోని అన్ని పార్టీలు, ప్రజా, కార్మిక సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బంద్ ప్రభావం రాష్ట్రంపై స్పష్టంగా కనిపిస్తోంది. శుక్రవారం ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులన్నీ డీపోలకే పరిమితమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన నిరసనల్లో వైఎస్సార్సీపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం, ఆప్, టీఎన్టీయూసీ, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్, ఎస్ఎఫ్ఐ సంఘాలు పాల్గొన్నాయి.