భారత్ లో భారీగా పెరిగిన కరోనా కేసులు..గడిచిన 24 గంటల్లో ..

వాస్తవం ప్రతినిధి: భారత్లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా  17,407 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,56,923కి చేరింది. ఇందులో 1,08,26,075 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,73,413 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 89 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో కరోనాతో ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 1,57,435కి చేరింది. ఇండియాలో జనవరి 16 వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఇప్పటి వరకు మొత్తం 1,66,16,048 మందికి వ్యాక్సిన్ అందించారు. మార్చి 1 నుంచి రెండో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించింది ఇండియా.