మళ్లీ చెలరేగిన భారత స్పిన్నర్లు.. ఇంగ్లండ్ 205 ఆలౌట్!

    వాస్తవం ప్రతినిధి: నరేంద్ర మోడీ స్టేడియంలో నేటి నుంచి జరుగుతున్న 4 వ టెస్టు మ్యాచ్ లో ఇంగ్లాండ్ తొలి ఇన్సింగ్స్‌లో 205 (75.5 ఓవర్లకు) పరుగులకు ఆలౌట్ అయింది. ఇదే స్టేడియంలో జరిగిన మూడో టెస్టులో బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. 4 వ టెస్టులో భారత బౌలర్లను తీవ్రంగా ప్రతిఘటించి బ్యాటింగ్ చేశారు. స్పిన్నర్ల దెబ్బకు 205 ఓవర్లలోనే చాప చుట్టేశారు ఇంగ్లీష్ ప్లేయర్స్.

    టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. మొదటి నుంచి బ్యాట్స్ మెన్స్ ఆచితూచి ఆడుతున్నారు. ఓ దశలో 30 పరుగులకే మూడు వికెట్లు ‌ కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును స్టోక్స్‌, బెయిర్‌ స్టోలు కలిసి చక్కదిద్దారు. స్టోక్స్ (55 పరుగులు), లార్వెన్స్ (46) పర్వాలేదనిపించారు. అలాగే పోప్ (29), బెయిర్ స్టో (28 పరుగులు) రాణించారు.