గంటా శ్రీనివాసరావు వస్తాను అంటే మేము కాదంటామా ? : విజయసాయి రెడ్డి

వాస్తవం ప్రతినిధి: విశాఖలో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రధాన అనుచరుడు కాశీ విశ్వనాథం వైసీపీలో చేరారు. అయన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. కాశీ విశ్వనాథం చేరికతో ఇప్పుడు గంటా ఎప్పుడు వైసీపీలో చేరుతారనే చర్చ మొదలైంది. దీనిపై ఎంపీ విజయసాయి రెడ్డి కూడా క్లారిటీ ఇచ్చారు. గంటా శ్రీనివాసరావు వస్తాను అంటే మేము కాదంటామా అంటూ కామెంట్ చేశారు. గంటా శ్రీనివాసరావు ఏ క్షణమైనా పార్టీ అవకాశం ఉందని టీడీపీ కూడా అనుమానిస్తోంది. ఇటీవలే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ టీడీపీ లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఏది ఏమైనా మున్సిపల్ ఎన్నికల ముందు గంటా ప్రధాన అనుచురుడు పార్టీ మారడం టీడీపీకి ఎదురుదెబ్బే అని చెప్పాలి.