ఆదివాసీ మహిళలతో కలిసి సంప్రదాయ ఝుమర్‌ నృత్యం చేసిన ప్రియాంక గాంధీ

వాస్తవం ప్రతినిధి: అసోంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ట్తరుణంలో కాంగ్రెస్ ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న అసోం గత ఎన్నికల్లో అధికారాన్ని చేజార్చుకుంది. దీంతో ఈ సారైనా అధికారం కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది.

15 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నేత దివంగత మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయి లేని ఆపార్టీకి పెద్ద లోటుగా కనిపిస్తోంది. దీంతో ప్రజలతో మమేకమవుతూ పార్టీ విజయానికి ప్రియాంక్ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం ముమ్మరం చేశారు. ఈ నేపధ్యంలో ..

అసోంలో కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ప్రారంభించారు. ప్రచారంలో భాగంగా ప్రియాంక పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు.

తేయాకు తోటల్లో పనిచేసే ఆదివాసీ మహిళలతో కలిసి తేయాకు తెంపారు. తేయాకు తోటల్లో వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి సంప్రదాయ ఝుమర్‌ నృత్యం చేశారు.