కాంగ్రెస్‌ నుంచి షర్మిల పార్టీలోకి భారీగా వలసలు?

వాస్తవం ప్రతినిధి: కాంగ్రెస్‌ నుంచి షర్మిల పార్టీలోకి భారీగా వలసలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఇందులో మొదటి వికెట్‌గా కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్‌ షర్మిల పార్టీలో చేరారు. బుధవారం ఆమె పెళ్లి రోజే. ఉదయం కాంగ్రెస్‌ నేతల దగ్గర ఆశీస్సులు తీసుకున్న ఆమె…మధ్యాహ్నం షర్మిల పార్టీలో చేరారు.

ఈమె కాదు. త్వరలోనే మరో ఇద్దరు అధికార ప్రతినిధులు ఆమె పార్టీలో చేరుతారని తెలుస్తోంది. తుంగతుర్తి గత రెండు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన అద్దంకి దయాకర్‌తో పాటు జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న మరో నేత కూడా షర్మిల పార్టీ వైపు చూస్తున్నారని తెలుస్తోంది.

వీరే కాదు. నల్గొండ, ఖమ్మంలో కొందరు కాంగ్రెస్‌ నేతలు షర్మిల పార్టీ వైపు చూస్తున్నారని తెలుస్తోంది. త్వరలోనే వీరంతా లోటస్‌పాండ్‌కు క్యూ కట్టడం ఖాయమని అంటున్నారు.