కరోనా వాక్సిన్ తీసుకొన్న టీం ఇండియా కోచ్ రవిశాస్త్రి

    వాస్తవం ప్రతినిధి: ఇండియ‌న్ క్రికెట్ టీమ్ కోచ్ ర‌విశాస్త్రి మంగ‌ళ‌వారం ఉద‌యం కొవిడ్‌-19 వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇంగ్లండ్‌తో సిరీస్ కోసం ప్ర‌స్తుతం అహ్మ‌దాబాద్‌లో ఉన్న అత‌డు.. అక్క‌డి అపోలో ఆసుప‌త్రిలో టీకా తీసుకున్న ఫొటోను ట్విట‌ర్‌లో షేర్ చేశాడు. తాను వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న‌ట్లు ర‌విశాస్త్రి చెప్పాడు. ఈ సంద‌ర్భంగా కరోనాకు వ్య‌తిరేకంగా కృషి చేసిన ఆరోగ్య సిబ్బంది, సైంటిస్టుల‌కు అత‌డు కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు.

    ప్ర‌స్తుతం ర‌విశాస్త్రి వ‌య‌సు 58. వ్యాక్సినేష‌న్‌ రెండో ద‌శ‌లో భాగంగా 60 ఏళ్లు దాటిన వారితోపాటు దీర్ఘ‌కాలిక వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న 45 ఏళ్లు పైబ‌డిన వారికి వ్యాక్సిన్ ఇస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌ధాని మోదీతోపాటు ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా ప‌లువురు ప్ర‌ముఖులు వ్యాక్సిన్ తీసుకున్నారు.