ఆ రెండు పార్టీలు తోడు దొంగలు: భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

వాస్తవం ప్రతినిధి: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. నిరుద్యోగులే లక్ష్యంగా విమర్శలు గుప్పించుకుంటున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం యువత, నిరుద్యోగలను మోసం చేయడంలో పోటీ పడుతున్నాయని సీఎల్‌పీ లీడర్‌ మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు.

బీజేపీ, టీఆర్‌ఎస్ రెండు పార్టీలు తోడు దొంగలని కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆస్తులు సృష్టిస్తే బీజేపీ ప్రభుత్వం వాటిని అమ్మేస్తోందని ఆరోపించారు. తెలంగాణలో లక్షా 92 వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నా ప్రభుత్వం భర్తీ చేయడం లేదని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి విధివిధానాలు కూడా రూపొందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, టీఆర్‌ఎస్‌కు యువత బుద్ధి చెప్పాలన్నారు.