దీదీతో తేజస్వీ భేటీ..పొత్తులపై చర్చ

వాస్తవం ప్రతినిధి: నేడు తృనమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతతో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజస్వీయాదవ్ భేటీ కానున్నారు. బంగాల్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనుండడంతో మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్‌తో జట్టుకట్టాలని తేజస్వీ నిర్ణయించారు.

ఈ నేపధ్యంలో నిన్న కోల్‌కతా చేరుకున్న తేజస్వీ యాదవ్ పార్టీ కార్యకర్తలను కలిసి ఎన్నికలపై చర్చించారు. నేడు మమతను కలిసి పొత్తులపై మాట్లాడనున్నట్టు తెలుస్తోంది. అసోంలో కాంగ్రెస్, ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్)తో కలిసి ఆర్జేడీ బరిలోకి దిగుతోంది.

బీహార్, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, ఒడిశా, చత్తీస్‌గఢ్‌లలో హిందీ మాట్లాడే బీహారీ ప్రజలు ఐదు శాతం వరకు ఉన్నారని తేజస్వీ తెలిపారు. ఈ లెక్కన 11 సీట్లలో తాము పోటీ చేయవచ్చని పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతానికి మాత్రం గెలిచే అవకాశాలు ఉన్నచోట అభ్యర్థులను నిలబెడతామని తేజస్వీ వివరించారు.