‘తానా’ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం.. తెలుగు సాహిత్య వినీలాకాశంలో హరికథా ప్రాభవం..

    వాస్తవం ప్రతినిధి:  అమెరికాలోని తానా(TANA) సంస్థ తెలుగు భాషను భావి తరాలకు అందించే విషయంలోనూ, తెలుగు సాహిత్యాన్ని కాపాడేందుకు గానూ కృషి చేస్తోంది.

    ఇందులో భాగంగా తానా ప్రపంచ సాహిత్య వేదిక ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ దృశ్య సాహిత్య సమావేశం జరుపుతోంది. ఫిబ్రవరి 28వ తారీఖున కూడా తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ’తెలుగు సాహిత్య వినీలాకాశంలో హరికథా ప్రాభవం‘ అనే ఓ ప్రత్యేక కార్యక్రమం జరగబోతోంది.

    భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 8గంటల 30 నిమిషాలకు (అమెరికా – 7:00AM PST; 9:00AM CST; 10:00 AM EST) ఈ కార్యక్రమం జరగబోతోంది. ’తెలుగు సాహిత్య వినీలాకాశంలో హరికథా ప్రాభవం‘ అనే అంశంపై ప్రత్యేక చర్చను నిర్వహిస్తారు. తిరుపతికి చెందిన ప్రముఖ కథకులు వాచస్పతి డాక్టర్ ముప్పవరపు వేంకట సింహాచల శాస్త్రి చే భక్తపోతన సాహిత్య వైభవం (హరికథా గానం) జరుగుతుంది. తెలుగు భాషపై మమకారం ఉన్న అందరూ ఈ కార్యక్రమానికి ఆహ్వానితులే.

    https://www.facebook.com/tana.org ఫేస్ బుక్ పేజీ ద్వారా కానీ, https://www.youtube.com/channel/UCwLhSy1ptf0i1CioyeZmzrw లింక్ ద్వారా యూట్యూబ్ లైవ్ లో కానీ ఈ కార్యక్రమాన్ని చూడవచ్చు. మరిన్ని వివరాలకు www.tana.org ను సందర్శించవచ్చని తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర ఓ ప్రకటనలో తెలిపారు.