వాస్తవం ప్రతినిధి: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ మ్యాచ్‌లను హైదరాబాద్ వేదికగా నిర్వహించాలని తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ట్వీట్ చేశారు. బీసీసీఐతోపాటు ఐపీఎల్ ఆఫీస్ బేరర్లను ట్యాగ్ చేస్తూ.. వచ్చే ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్‌ను కూడా ఒక వేదికగా చేయండని కోరారు. తాము తీసుకున్న కొవిడ్ కట్టడి చర్యల కారణంగా దేశంలోని అన్ని మెట్రో నగరాల కంటే హైదరాబాద్‌లోనే అతి తక్కువ కేసులు నమోదయ్యాయని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. ఐపీఎల్ నిర్వహణకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.