అక్కినేని వారి నిర్మాణంలో మెగా వారి అబ్బాయి

వాస్తవం సినిమా: మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ తొలి సినిమా ఉప్పెనతో హిట్ కొట్టిన ఆనందంలో ఉన్నాడు. మెగా ఫ్యామిలీ అనే ట్యాగ్ లైన్‌ ఉన్నప్పటికీ ఈ సినిమాలో తన అద్భుత నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాడీ హీరో. తొలి సినిమానే అయినప్పటికీ సహజ నటనతో సినిమా విషయంలో కీలకపోత్ర పోషించాడు. హీరోయిన్ కృతి శెట్టికి ఈ సినిమా ద్వారా మ‌రిన్ని సినిమా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ఈ సినిమా భారీ వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా విజయంతో వైష్ణవ్‌ చుట్టూ దర్శక, నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఈ యంగ్‌ హీరోతో సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే వైష్ణవ్‌ ఇప్పటికే పలు సినిమాలను ఓకే కూడా చేశాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమా ఇంకా విడుదలవక ముందే వైష్ణవ్‌ కొన్ని సినిమాలకు సైన్‌ చేసిటనట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున నిర్మాణంలో వైష్ణవ్‌ ఓ సినిమాలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘మనం ఎంటర్‌టైన్‌ మెంట్స్‌’ బ్యానర్‌పై ఈ సినిమాను నాగార్జున నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అంతేకాకుండా ఈ సినిమా ద్వారా నాగార్జున మరో కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నాడని సమాచారం.  మరి అక్కినేని వారి నిర్మాణంలో మెగా వారి అబ్బాయి నటించబోయే ఈ సినిమా ఎలాంటి రికార్డులు తిరగరాస్తుందో వేచి చూడాలి.