అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షల పొడిగింపు..డిజిసిఎ ప్రకటన

వాస్తవం ప్రతినిధి: అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలను మార్చి 31వరకు పొడిగించినట్లు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డిజిసిఎ) తెలిపింది. గతంలో విధించిన నిషేధం ఈ నెల 28తో ముగియ నుంది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. మరోసారి నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు డిజిసిఎ ప్రకటించింది. అయితే కార్గో విమానాలు, ఎయిర్‌ బబుల్‌ ఒప్పందంలో భాగంగా నడుస్తున్న ప్రత్యేక విమానాలకు ఈ ఆంక్షల నుండి మినహాయింపు ఇచ్చింది .