మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్దమైన ఇస్రో..శ్రీవారిని దర్శించుకొన్న శివన్

వాస్తవం ప్రతినిధి: శ్రీవారిని ఇస్రో చైర్మన్ శివన్ దర్శించుకున్నారు. పీఎస్ఎల్వీ సీ 51 నమూనా రాకెట్టును శ్రీవారి పాదాల వుంచి ఆశీస్సులు పొందారు. రేపు ఉదయం 10.24 నిమిషాలకు పీఎస్ఎల్వీ సీ 51 ను నింగిలోకి ప్రవేశపెడుతున్నాం అని ఆయన పేర్కొన్నారు. ఈ సంవత్సరంలో ఇదే మొదటి శాటిలైట్ ప్రయోగం అని ఆయన వెల్లడించారు. ఇస్రో ద్వారా మొదటి కమర్షియల్ ప్రయోగం కూడా ఇదే అని పేర్కొన్నారు. రాబోవు రోజుల్లో మరెన్ని రాకెట్ లను నింగిలోకి ప్రవేశపెడుతాం అని వెల్లడించారు.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆధ్యర్యంలో నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ధ్రువ ఉపగ్రహ ప్రయోగ వాహకనౌక-సి51 (పిఎస్‌ఎల్‌వి)ని ఆదివారం ఉదయం 10.24 గటలకు నింగిలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. ప్రైవేట్‌ సంస్థల భాగస్వామ్యంతో చిన్న ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లే రాకెట్‌ను ఇస్రో మొదటిసారి ప్రయోగిస్తోంది. ఈ ప్రయోగానికి సంబంధించి కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ఈరోజు ఉదయం 8.54 గంటలకు ప్రారంభమైంది. ఈ కౌంట్‌డౌన్‌ దాదాపు 25 గంటలపాటు నిరంతరాయంగా కొనసాగి అనంతరం నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్‌ ద్వారా బ్రెజిల్‌కు చెందిన అమెజోనియా-1తోపాటు మనదేశానికి చెందిన 18 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు ఇస్రో చైర్మన్‌ శివన్‌ వెల్లడించారు.