దేశంలో శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల

వాస్తవం ప్రతినిధి: దేశంలో అసెంబ్లీ ఎన్నికల గంట మోగింది. 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు తాజా షెడ్యూల్ ద్వారా ఎన్నికలు నిర్వహించనున్నారు.

బెంగాల్ లో 294 స్థానాలు, త‌మిళ‌నాడులో 234, పుదుచ్చేరిలో 33, కేర‌ళ‌లో 140, అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో పుదుచ్చేరి కేంద్ర‌పాలిత ప్రాంతంగా ఉంది. త‌మిళ‌నాడులో అధికార అన్నాడీఎంకేతో బీజేపీ క‌లిసి పోటి చేసే అవ‌కాశం ఉండ‌గా, డీఎంకే త‌రుపున స్టాలిన్ గెలుపుకోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. గ‌త 10సంవ‌త్స‌రాలుగా అన్నాడీఎంకే అక్క‌డ అధికారంలో ఉంది.

ఇక బెంగాల్ లో అధికార టీఎంసీ, బీజేపీ మ‌ధ్య హోరాహోరీ పోరు నెల‌కొంది. పుదుచ్చేరిలో ఇటీవ‌లే కాంగ్రెస్ ప్ర‌భుత్వం కుప్ప‌కూలింది. అక్క‌డ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయ‌టంతో ప్ర‌భుత్వం ర‌ద్దైంది. కేర‌ళ‌లో వామ‌ప‌క్ష కూటమి అధికారంలో ఉంది.

ఆయా రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో పోలింగ్ జరిగే తేదీలు ఇవే…

పశ్చిమ బెంగాల్- తొలివిడత మార్చి 27, రెండో విడత ఏప్రిల్ 1, మూడో విడత ఏప్రిల్ 6, నాలుగో విడత ఏప్రిల్ 10, ఐదో విడత ఏప్రిల్ 17, ఆరో విడత ఏప్రిల్ 22, ఏడో విడత ఏప్రిల్ 26, ఎనిమిదో విడత ఏప్రిల్ 29.

తమిళనాడు- ఏప్రిల్ 6
కేరళ- ఏప్రిల్ 6
పుదుచ్చేరి- ఏప్రిల్ 6
అసోం- తొలివిడత మార్చి 27, రెండో విడత ఏప్రిల్ 1, మూడో విడత ఏప్రిల్ 6.