జెసి ప్రభాకర్ రెడ్డి పై మరో కేసు

వాస్తవం ప్రతినిధి: జేసి ప్రభాకర్ రెడ్డి పై మరో కేసు నమోదైంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎన్నికల కోడ్ ఉల్లఘించడమే కాకుండా ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారన్న ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి పైకేసు నమోదు చేసారు అనంతపురం జిల్లా పోలీసులు.

బృందావనం అపార్ట్ మెంట్ లోని గౌరీనాథ్ రెడ్డి ఫ్లాట్ లో సోదాలు నిర్వహించి క్రికెట్ కిట్లు స్వాధీనం చేసుకున్నారు. 188,171ఎ సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. అయితే ఇదంతా క్షక్ష్య సాధింపు చర్యలు అంటున్నారు జెసి వర్గీయులు…. దీనిపై కోర్ట్ కి వెళ్తామని అంటున్నారు. ఇప్పటికే జేసి ఫ్యామిలీ మీద పలు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.