ఇంగ్లాండ్ తో మూడో టెస్టు లో భారత్ ఘన విజయం

    వాస్తవం ప్రతినిధి: ఇంగ్లాండ్ తో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ జరిగిన మూడో టెస్టు లో భారత్ ఘన విజయం సాధించింది. డే/నైట్ టెస్టులో భారత్ రెండు రోజుల్లోనే ఇంగ్లాండ్ ను చిత్తుగా ఓడించింది. రెండో రోజు డిన్నర్ బ్రేక్ కు రెండు ఓవర్ల ముందు 49 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన భారత్ డిన్నర్ బ్రేక్ తరువాత లాంఛనాన్ని ముగించింది. వికెట్ నష్టపోకుండా 49 పరుగులు చేసి పది వికేట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్ లో 2-1 ఆధిక్యంలోనికి దూసు కెళ్లింది. అంతే కాకుండా వరల్డ్ కఫ్ ఫైనల్స్ కు ఒక అడుగు దూరంలో నిలిచింది. ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 6 రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టి మొత్తంగా టెస్టులో 11 వికెట్ల తీసిన అక్షర్ పటేల్ కు మ్యాన్ ఆప్ ది మ్యాచ్ అభించింది. అలాగే ఈ టెస్టులోరెండో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్ల తీసిన రవిచంద్రశ్ అశ్విన్ 400 వికెట్ల క్లబ్ లో చేరారు. అతి వేగంగా ఈ ఫీట్ సాధించిన బౌలర్లలో ముత్తయ్య మురళీధరన్ తరువాత రోండో వాడిగా నిలిచాడు.