శ్రీవారి ఎస్వీబీసీ ట్రస్టుకు పోస్కో సంస్థ భారీ విరాళం

వాస్తవం ప్రతినిధి: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారికి పోస్కో సంస్థ భారీగా విరాళం ఇచ్చింది. శ్రీవారి ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.9 కోట్ల విరాళం ప్రకటించింది. ఈమేరకు శుక్రవారం ఉదయం టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి పోస్కో సంస్థ సీఈవో సంజయ్‌ పాసి విరాళానికి సంబంధించిన డీడీలను అందజేశారు. శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాతలకు పండితులు వేదాశీర్వచనంచేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.