ఇషాంత్ శర్మను అభినందించిన రామ్‌నాథ్‌ కోవింద్‌, అమిత్ షా

    వాస్తవం ప్రతినిధి:  100 వ టెస్టు ఆడుతున్న భారత్ పేస్ బౌలర్ ఇషాంత్ శర్మను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, హోం మంత్రి అమిత్ షా అభినందించారు. మ్యాచ్ సందర్భంగా హాజరైన వారు మొమెంటోను అందజేసి ఇషాంత్ ను సత్కరించారు. కపిల్ దేవ్ తర్వాత 100వ టెస్టు ఆడుతున్నది ఇషాంత్ మాత్రమే. అలాగే ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్‌ స్టేడియమైన మొతెరాలో అభిమానుల కేరింతలు మొదలయ్యాయి. భారత్, ఇంగ్లాండ్ ల మధ్య నేటి నుంచి మొదలైన మూడో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా అభిమానుల హాడావుడి కొనసాగుతోంది.