‘నరేంద్ర మోడీ స్టేడియం’ ను ప్రారంభించిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

    వాస్తవం ప్రతినిధి: భారత దేశంలో మరో అంతర్జాతీయ స్టేడియం అందుబాటులోకి వచ్చింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కొత్త హంగులతో పునరుద్ధరించిన మొతేరా క్రికెట్‌ స్టేడియానికి ప్రధాని నరేంద్ర మోడీ స్టేడియంగా పేరు మార్చారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ మోతేరాలో నిర్మించిన ఈ స్టేడియం ప్రపంచంలోనే అతి పెద్ద స్డేడియం. ఈ స్టేడియంలో మొట్టమొదటి మ్యాచ్‌ నేడు 2.30 గంటలకు టీమిండియా-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య మూడో టెస్టు జరగనుంది.

    కాగా, నరేంద్ర మోడీ స్టేడియాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవిండ్‌ బుధవారం వర్చువల్‌ విధానం ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అమిత్‌షా, కిరణ్‌ రిజిజు తదితరులు పాల్గొన్నారు.

    నరేంద్ర మోడీ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం. ఇందులో లక్షా 32 వేల మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యం ఉంది. స్టేడియం మధ్యలో ఒక్క స్తంభంగానీ, మరే ఇతర అడ్డంకులుగానీ లేవు. ఏ స్టాండ్‌లో కూర్చోని అయినా మ్యాచ్‌ను అడ్డంకులు లేకుండా ఆస్వాదించవచ్చు. మోతేరాలో 11 పిచ్‌లను నిర్మించారు. వీటిలోని ఐదింటిని ఎర్ర బంకమట్టి, నల్ల మట్టిని ఉపయోగించబడ్డాయి.