రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా మృతుల సంఖ్య..బైడెన్ కీలక నిర్ణయం

వాస్తవం ప్రతినిధి: క‌రోనా వైర‌స్ అగ్ర‌రాజ్యం అమెరికాను క‌ల‌వ‌రపెడుతూనే ఉంది. ఆ దేశంలో క‌రోనాతో మ‌ర‌ణించిన వారి సంఖ్య 5ల‌క్ష‌లు దాటింది. ఇది ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో మ‌ర‌ణించిన వారి క‌న్నా అత్య‌ధిక సంఖ్య కావ‌టం అంద‌ర్నీ కలవరపెడుతోంది.

ఈ మ‌ర‌ణాల‌పై అమెరికా ప్రెసిడెంట్ జోబైడ‌న్ నివాళి అర్పిస్తూ… వారి జ్ఞాప‌కంగా అమెరికా జెండాను ఐదు రోజుల పాటు అవ‌న‌త‌నం చేయాల‌ని ఆదేశించారు.

అమెరికాలో ఓ వైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ కేసుల సంఖ్య విప‌రీతంగా న‌మోద‌వుతూనే ఉంది. క‌రోనా మ‌ర‌ణాలు కూడా కంట్రోల్ కావ‌టం లేదు.

వ‌రల్డ్ వార్-2 స‌మ‌యంలో 405,000మంది అమెరిక‌న్లు మ‌ర‌ణించ‌గా… వియ‌త్నాం వార్ లో 58,000, కొరియాతో జ‌రిగిన యుద్ధంలో 36వేల మంది మ‌ర‌ణించారు. ఇప్పుడు ఈ మూడు యుద్ధాల్లో మ‌ర‌ణించిన వారి క‌న్నా ఎక్కువ‌గా క‌రోనాతో మ‌ర‌ణించారు.