వాస్తవం సినిమా: టాలీవుడ్లో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్లతో తేజ ఒకరు. సినీ పరిశ్రమలో తేజ. ఎంతో కష్టపడి కెమెరామెన్ నుంచి డైరెక్టర్ గా ఎదిగి..నితిన్, ఉదయ్ కిరణ్, రీమా సేన్, సదా, కాజల్, నవదీప్, సుమన్ శెట్టి, మ్యూజిక్ డైరెక్టర్స్ ఆర్పీ పట్నాయక్, అనూప్ రూబెన్స్ టాలీవుడ్‌కు పరిచయం చేశాడు. ఈ దర్శకుడు ఇపుడు చిత్రం 1.1 ప్రాజెక్టును ప్రకటించాడు. గతంలో మాదిరిగానే ఈ సారి కూడా కొత్త టాలెంట్ కలిగిన వ్యక్తులను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు రెడీ అయ్యాడట తేజ.
సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు తేజ. చిత్రం 1.1 లో 45 మంది కొత్త నటీనటులను ఎంపిక చేయనున్నట్టు తెలిపాడు తేజ. సమీర్ రెడ్డి ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత ఆర్పీ పట్నాయక్ మళ్లీ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా పనిచేయబోతున్నాడు. రొమాంటిక్ కామెడీ స్టోరీతో రానున్న ఈ ప్రాజెక్టు వచ్చే నెల నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది.