కీరవాణి కుమారుడు శ్రీ సింహ ‘తెల్లవారితే గురువారం’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల

వాస్తవం సినిమా: ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు కీరవాణి కుమారుడు శ్రీ సింహా యమదొంగ’, ‘మర్యాద రామన్న’ చిత్రాలలో బాలనటుడిగా సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘మత్తువదలరా’తో హీరోగా పరిచయం అయి తొలి సినిమాతోనే సత్తా చాటాడు. నేడు మంగళవారం శ్రీ సింహా పుట్టినరోజు.

ప్ర‌స్తుతం తెల్ల‌వారితే గురువారం, భాగ్ సాలే అనే చిత్రాలు చేస్తున్నాడు శ్రీ సింహ‌. ఈ రోజు ఆయ‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా తెల్లవారితే గురువారం చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో పెళ్లి కొడుకు గెట‌ప్‌లో ఉన్న శ్రీ సింహ సిగ‌రెట్ తాగుతూ క‌నిపించారు. ఈ చిత్రాన్ని మ‌ణికాంత్ జెల్లి తెర‌కెక్కించారు.

ఇక శ్రీ సింహ హీరోగా భాగ్ సాలే అనే టైటిల్‌తో ఓ చిత్రం తెరకెక్కుతుంది. ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు సమర్పణలో మధుర ఎంటర్ టైన్ మెంట్, బిగ్ బెన్ సినిమాస్ భాగస్వామ్యంలో మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు ప్రణీత్ బ్రమాండపల్లి చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. క్రైమ్ కామెడీ జానర్ లో తెరకెక్కుతున్న “భాగ్ సాలే” మార్చి మూడో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జ‌రుపుకోనుంది. ఈ చిత్రానికి కీరవాణి మరో తనయుడు కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నారు.