వాస్తవం ప్రతినిధి: ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతుంది. సీఎం జగన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సచివాలయంలో సమావేశమైన మంత్రిమండలి.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సహా.. పలు కీలక అంశాలపై చర్చిస్తుంది. దాదాపు 23 అంశాలతో కూడిన అజెండాపై మంత్రివర్గం చర్చిస్తున్నట్లు సమాచారం. మార్చిలో జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో ఆయా శాఖల డిమాండ్లను కేబినెట్ ముందుంచారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాబడి, ఖర్చులు, అప్పులపై ఇప్పటికే సీఎం జగన్ అధికారులతో సమీక్షలు నిర్వహించారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులపై కేబినెట్ చర్చిస్తుంది.
మరోవైపు గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల సమీక్ష, మార్చిలో జరగనున్న మున్సిపల్, కార్పొరేషన్ల ఎన్నికలు.. సంక్షేమ పథకాలతోపాటూ కీలక అంశాలపై కేబినెట్ భేటీలో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది.